: రేవంత్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
టి.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై 3 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో రెండు, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఒక కేసును పోలీసులు నమోదు చేశారు. 341,188, 506, 509 సెక్షన్ల కింద కింద ఈ కేసులు నమోదయ్యాయి. చర్లపల్లి జైలు నుంచి నిన్న(బుధవారం) విడుదలైన సమయంలో భారీ ర్యాలీ నిర్వహించిన రేవంత్... రెచ్చగొట్టే ప్రసంగాలు, మారణాయుధాలతో బెదిరింపులు, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.