: సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంలో ఊరట


బీజేపీ నేత సుబ్మహ్మణ్య స్వామి నాన్ బెయిలబుల్ వారెంట్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో తెలిపారు. "కరీంగంజ్ కోర్టు ఇచ్చిన అరెస్టు వారెంట్ పై సుప్రీం స్టే ఇచ్చింది. ఇక నాపై దాఖలైన ఫిర్యాదును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయిస్తాను" అని స్వామి తెలిపారు. రెండు నెలల కిందట కజిరంగ విశ్వవిద్యాలయంలో సుబ్మహ్మణ్య స్వామి రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. దాంతో మార్చిలో అసోంలోని కరీంగంజ్ కోర్టులో ఫిర్యాదు దాఖలవడంతో సమన్లు జారీ అయ్యాయి. అనంతరం కోర్టు నుంచి అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది.

  • Loading...

More Telugu News