: దిగ్విజయ్ ఓ బ్లఫర్: డీఎస్ తీవ్ర వ్యాఖ్యలు


కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవకాశాలను ఇచ్చిన పార్టీ అధినేత్రి సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటానని టీఆర్ఎస్ నేత డీఎస్ చెప్పారు. 1969లో గాంధీభవన్ లో అడుగుపెట్టానని గుర్తు చేసుకున్న ఆయన... 2000లో తెలంగాణ గురించి అసెంబ్లీలో మాట్లాడానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడటం ఎంతో బాధిస్తోందని... తన జీవితంలో ఈ రోజు ఎంతో దురదృష్టకరమైనదని అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తన పట్ల దిగజారి మాట్లాడారని... ఎమ్మెల్సీ పదవి తనకు ఒక లెక్క కాదని డీఎస్ చెప్పారు. చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్ 'ఓ బ్లఫర్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడటానికి దిగ్విజయ్ కు ఎంత ధైర్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల బీఫామ్ లు ఇచ్చిన తనకు ఎమ్మెల్సీ ఓ లెక్కా? అని ప్రశ్నించారు. ఆకుల లలితకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. కాంగ్రెస్ లో తనకు ఎన్నో పదవులు వచ్చాయని... అవమానాలు కూడా ఎదురయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కమిట్ మెంట్ తో పని చేస్తున్నారని కితాబిచ్చారు. తాను పదవులు ఆశించి టీఆర్ఎస్ లో చేరడం లేదని స్పష్టం చేశారు. కేవలం తెలంగాణను అభివృద్ధి చేసే క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News