: ఖబడ్దార్ రేవంత్ రెడ్డి... నీ నోటికి కుట్లు వేస్తాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


ఓటుకు నోటు కేసులో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారని... ఆయన చరిత్ర ముగిసి పోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆయన రేవంత్ రెడ్డి కాదని... తెలంగాణలో 'రవ్వంత' రెడ్డి అని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే అర్హత రేవంత్ కు లేదని మండిపడ్డారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని... లేకపోతే నోటికి కుట్లు వేస్తామని హెచ్చరించారు. పక్క రాష్ట్రంలో కాంట్రాక్టుల డబ్బును తీసుకొచ్చి, ఇక్కడ ర్యాలీలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని చెప్పారు.

  • Loading...

More Telugu News