: ఓడినా కూడా పదవులిచ్చాం కదా? ఇంకేం చేయాలి?: డీఎస్ పై డిగ్గీ రాజా
ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్ గతంలో ఎన్నోసార్లు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, తాము ఆయన సీనియారిటీని చూసి పదవులిచ్చి గౌరవించామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన్ను పార్టీ సముచితంగా సత్కరించిందని, ఇంకేం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించామని, ఈ దఫా మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో, ఆయన ప్రతిపాదించిన ఆకుల లలితను ఎంపిక చేశామని గుర్తు చేశారు. సీనియర్లు కేవలం అవకాశవాదంతో పార్టీని వీడుతున్నారని విమర్శించారు.