: సదాశివపేటలో భారీ అగ్ని ప్రమాదం... రూ.3 కోట్ల విలువ చేసే పత్తి బేళ్లు బుగ్గి
మెదక్ జిల్లా సదాశివపేట మార్కెట్ యార్డులో నేటి తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని భావిస్తున్న ఈ ప్రమాదంలో రూ.3 కోట్ల విలువ చేసే పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడకు చేరుకుని అగ్ని కీలలను నిలువరించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో పత్తి బేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సంగారెడ్డి ఆర్డీఓ మధుకర్ రెడ్డి, డీఎస్పీ తిరుపతన్నలు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.