: ధోనీ జిమ్ లో చేరిన రెజ్లర్ సుశీల్ కుమార్


ఒలింపియన్ రెజ్లర్ సుశీల్ కుమార్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్థాపించిన 'స్పోర్ట్స్ ఫిట్' జిమ్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, ఫిట్ నెస్ పట్ల భారతీయుల్లో అవగాహన పెరుగుతోందని అన్నారు. స్పోర్ట్స్ ఫిట్ మంచి శిక్షణ అందిస్తుందని, దాని పని తీరు బాగుందని సుశీల్ కితాబిచ్చారు. స్పోర్ట్స్ ఫిట్ గత మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా 32 చోట్ల బ్రాంచ్ లను ఏర్పాటు చేసింది. ఈ జిమ్ లో కెప్టెన్ ధోనీతో పాటు జడేజా భాగస్వామిగా ఉన్నాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News