: అది 'మాటల' కుంభకోణం: మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే


మహారాష్ట్రలో పల్లీ చిక్కీ కుంభకోణం 'మాటల' కుంభకోణమని ఆ రాష్ట్ర మంత్రి పంకజ ముండే కొట్టిపడేశారు. ముంబైలో ఆమె మాట్లాడుతూ, పల్లీ చిక్కీ కుంభకోణం అంటూ విమర్శలు చేస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండగా, ఇవే వస్తువులను 408 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని అన్నారు. తానెలాంటి కుంభకోణానికి పాల్పడలేదని, తన మంత్రి వర్గ శాఖ ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ కుట్ర అని ఆమె తెలిపారు. ఏసీబీ అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు. కాగా, పల్లీ చిక్కీలు, పుస్తకాలు, మ్యాట్లు మొదలైన వస్తువుల కొనుగోలుపై 206 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మహారాష్ట్రలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News