: కాసేపట్లో రేవంత్ విడుదల... రిలీజ్ ఆర్డర్ కాపీతో చర్లపల్లి జైలుకు వెళ్లిన లాయర్లు
నిన్నటి నుంచి నెలకొన్న టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడనుంది. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. రిలీజ్ ఆర్డర్ కాపీని రేవంత్ తరపు లాయర్లకు ఏసీబీ న్యాయస్థానం అందించింది. ఆర్డర్ కాపీలో రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని చర్లపల్లి జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఆర్డర్ కాపీని తీసుకుని వారు చర్లపల్లి కారాగారానికి బయలుదేరారు. రేవంత్ తో పాటు సెబాస్టియన్, ఉదయసింహలు కూడా జైలు నుంచి బెయిల్ పై విడుదల కానున్నారు. నిన్ననే రేవంత్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ... ఆర్డర్లో టైపింగ్ పొరపాట్ల వల్ల ఆయన విడుదల ఒక రోజు ఆలస్యమయింది.