: మాధవి లతతో జత కడుతున్న గజల్ శ్రీనివాస్
గజల్ గానంతో అందరినీ మెప్పించి... గజల్ నే ఇంటి పేరుగా మార్చుకున్న గజల్ శ్రీనివాస్ వెండి తెరపై మెరవనున్నారు. ఆయన హీరోగా, కృష్ణ వాసా దర్శకత్వంలో 'అనుష్ఠానం' అనే చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ఈ చిత్రంలో గజల్ శ్రీనివాస్ జంటగా మాధవి లత నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ రచయిత చలం 1950లో రచించిన 'అనుష్ఠానం' కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భార్యాభర్తల మధ్య నెలకొనే సున్నిత అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది.