: తిరుమలలో సంప్రదాయాన్ని పాటించిన రాష్ట్రపతి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం మధ్యాహ్నం తిరుమల విచ్చేశారు. ఆయన తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ, తొలుత శ్రీవరాహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాతే శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు. రాష్ట్రపతికి శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో సాంబశివరావు తదితరులు స్వాగతం పలికారు. ఈ ఉదయం రాష్ట్రపతి తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కపిలతీర్థం వెళ్లి, అపై తిరుమల చేరుకున్నారు.

  • Loading...

More Telugu News