: నేను నచ్చలేదా? లేక నా ఫేస్ నచ్చలేదా?: గుత్తా జ్వాల
గుత్తా జ్వాల... ఆటకంటే అందచందాలు, వివాదాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. రెండు రోజుల క్రితం కెనడాలో జరిగిన 'కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ' ఫైనల్లో తన భాగస్వామి అశ్విని పొన్నప్పతో కలసి సత్తా చాటింది. కేవలం 35 నిమిషాల్లోనే తన ప్రత్యర్థులను మట్టికరిపించి... టైటిల్ ను గెలుచుకుంది. కోర్టులోనే కాకుండా కోర్టు బయట కూడా తన ప్రత్యర్థులపై విరుచుకుపడటం జ్వాలకు వెరీ కామన్. ఈ క్రమంలో, మరోసారి తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది జ్వాల. "నేను నచ్చలేదో? లేక నా ఫేస్ నచ్చలేదో? పనిగట్టుకుని నాపై రాజకీయాలు చేస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ అకాడమీకి నిధులిస్తూ వాటిని ఎంకరేజ్ చేయడం ఏంటని ఇన్ డైరెక్టుగా పుల్లెల గోపీచంద్ అకాడమీని ఉద్దేశించి విమర్శలు గుప్పించింది. బ్యాడ్మింటన్ లో ఎంతో రాణిస్తున్నప్పటికీ... ఒలింపిక్ టాప్ స్కీంకు తన పేరును ప్రతిపాదించకపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని చెప్పింది.