: రేవంత్‌ బెయిలార్డరు పొరపాటు సరిదిద్దిన హైకోర్టు


నిన్న హైకోర్టు ఇచ్చిన రేవంత్ రెడ్డి బెయిలార్డరులో జరిగిన అచ్చుతప్పులను సరిచేయాలని ఆయన తరపు న్యాయవాదులు వేసిన మెమోపై కోర్టు కొత్త ఆర్డర్ జారీ చేసింది. న్యాయవాదులు వేసిన 'ఫర్ బీయింగ్'పై పెద్దగా వాదనలు లేకుండానే న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ష్యూరిటీలు, డిపాజిట్లు, బెయిల్‌ ఆర్డర్‌ తదితరాలను ఏసీబీ ప్రత్యేక కోర్టులో సమర్పించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌ లో న్యాయవాదులు కోరగా, అందుకు కూడా న్యాయమూర్తి అంగీకరించారు. వ్యక్తిగత పూచీకత్తును ఏసీబీ కోర్టులోనే సమర్పించాలని ఆదేశించారు. ఆర్డర్‌ కాపీని రేవంత్‌ రెడ్డి తరపు లాయర్లు కాసేపట్లో అందుకోనున్నారు. వాటిని ఏసీబీ కోర్టుకు అందిస్తే, రేవంత్ విడుదలకు ఆదేశాలు వస్తాయి.

  • Loading...

More Telugu News