: డీఎస్ కు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇవ్వనున్న టీఆర్ఎస్... డీఎస్ దారిలోనే దానం?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి కొద్ది రోజుల్లో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో, ఈ ఉదయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించారు. ఈ నేపథ్యంలో, డీఎస్ కు ఎమ్మెల్సీ పదవి కానీ, రాజ్యసభ సీటు కానీ ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత చూపినట్టు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన దానం నాగేందర్, సుదర్శన్ రెడ్డిలు కూడా సొంత పార్టీకి హ్యాండిచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.