: చైనా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ


చైనా ప్రధాని లీ కెకియాంగ్ 60వ జన్మదినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'వీబో' ఖాతాలో ఈ మేరకు తన సందేశాన్ని పోస్టు చేశారు. "డియర్ కెకియాంగ్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు. మే నెలలో చైనాలో పర్యటించిన సందర్భంగా కెకియాంగ్ తో భేటీని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, కెకియాంగ్ ప్రస్తుతం బెల్జియం, ఫ్రాన్స్ దేశాల పర్యటనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News