: తోటి విమాన ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టిన ఫడ్నవిస్


సాధారణంగా వీఐపీ సంస్కృతి సామాన్యులను గుళ్లు, గోపురాలు, సభలు, సమావేశాలప్పుడు ఇబ్బంది పెడుతుంది. మహారాష్ట్రలో మాత్రం విమాన ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టింది. మహారాష్ట్ర సీఎం కారణంగా ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా బయల్దేరింది. తన బృందంతో న్యూయార్క్ వెళ్తున్న ఫడ్నవిస్ సరైన సమయానికే శివాజీ టెర్మినల్ కు చేరుకున్నారు. కానీ ఆయన సహాయకుడు కొత్త పాస్ పోర్టుకు బదులు కాలం చెల్లిన పాస్ పోర్టును తెచ్చాడు. దీంతో కొత్త పాస్ పోర్ట్ కోసం సిబ్బంది ఆయనింటికి వెళ్లి దానిని తెచ్చేసరికి లేట్ అయిందట.

  • Loading...

More Telugu News