: గోదావరి పుష్కరాలకు అమిత్ షాకు ఏపీ మంత్రి ఆహ్వానం
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను గోదావరి పుష్కరాలకు ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన మంత్రి ఆయనతో భేటీ అయ్యారు. పుష్కరాలకు తప్పకుండా రావాలని షాను కోరారు. ఏపీలో జులైలో గోదావరి పుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే.