: చిలకలూరిపేట ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం... ఆందోళనలో ఖాతాదారులు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకులోని ఏసీ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బ్యాంకులో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో సిబ్బంది, ఖాతాదారులు భయంతో బయటికి పరుగులు పెట్టారు. ఘటన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయని తెలుస్తోంది. మరోవైపు బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.