: సీబీఐ కోర్టుకు హాజరైన దాసరి
బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను కేవలం బొగ్గు శాఖ సహాయమంత్రిగానే పనిచేశానని... శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ అప్పటి ప్రధాని, బొగ్గు శాఖ మంత్రి మన్మోహన్ సింగే తీసుకున్నారని తెలిపారు. కోల్ బ్లాక్స్ కేటాయింపుల దగ్గర్నుంచి అన్ని నిర్ణయాలు మన్మోహన్ వే అని చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించడమే తప్ప, తనకు తాను ఏనాడూ సొంత నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించారు. కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.