: ముంబయి హైకోర్టులో నెస్లేకు స్వల్ప ఊరట


ముంబయి హైకోర్టులో నెస్లే సంస్థకు స్వల్ప ఊరట లభించింది. భారత్ లో ఇప్పటికే నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నెస్లే చేసిన అభ్యర్థనకు కోర్టు అంగీకరించిరింది. ఈ మేరకు కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. మ్యాగీ నూడుల్స్ లో సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయంటూ భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) తనిఖీల్లో రుజువు అయింది. ఈ నేపథ్యంలో మ్యాగీ ఉత్పత్తులపై ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వంసం చేయాలంటూ డిమాండ్ రావడంతో నెస్లే కోర్టును ఆశ్రయించింది. అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని తాజాగా కోర్టును కోరింది.

  • Loading...

More Telugu News