: స్వల్ప అస్వస్థతకు గురైన చంద్రబాబు... కేర్ ఆసుపత్రిలో చికిత్స
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు నొప్పితో ఆయన బాధపడుతున్నారు. దీంతో, కేర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈనాటి అపాయింట్ మెంట్లను అన్నింటినీ రద్దు చేసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు స్వల్ప అస్వస్థతకు గురి కావడం గమనించదగ్గ అంశం.