: హైకోర్టు దగ్గర స్వల్ప ఉద్రిక్తత... రేవంత్ న్యాయవాదిని అడ్డుకున్న టి.లాయర్లు
ఓటుకు నోటు కేసులో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ తరపు లాయర్ కృష్ణస్వరూప్ ను తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. కేసు విచారణకు సంబంధించిన వివరాలను మీడియాకు కృష్ణస్వరూప్ వివరిస్తుండగా... తెలంగాణ లాయర్లు అభ్యంతరం చెప్పారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో, పోలీసులు కల్పించుకుని, టి.న్యాయవాదులకు సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు.