: మత్తయ్య ఎక్కడికీ పారిపోలేదు కదా?: ఏజీ వాదనపై న్యాయమూర్తి
ఓటుకు నోటు కేసులో నాలుగో ముద్దాయి మత్తయ్య పారిపోయాడని, ఆయన్ను విచారించాల్సి వుందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి చేసిన వాదనతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించలేదు. ఆయన కోర్టును ఆశ్రయించారన్న సంగతిని ఏసీబీ మరచిందా? అని ప్రశ్నించారు. ఆయన వేసిన పిటిషన్ కోర్టులో విచారణ దశలో ఉందని గుర్తు చేశారు. కోర్టును ఆశ్రయించిన వ్యక్తి పారిపోయాడని ఎలా చెబుతారని ఏజీని అడిగారు. మత్తయ్య కనిపించడం లేదని ఏసీబీ చెబుతున్న వాదనను సమర్థించలేమని అన్నారు. ఈ కేసులో మిగతా ముగ్గురు నిందితులకు ఈ ఉదయం బెయిలు లభించిన సంగతి తెలిసిందే.