: జపాను బులెట్ రైల్లో నిప్పంటించుకుని ఆత్మహత్య... అది చూసి గుండె ఆగి మరణించిన ఇద్దరు ప్రయాణికులు
ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే బులెట్ రైళ్లలో అదొకటి. జపాన్ లోని టోక్యో నుంచి ఒసాకాకు వెడుతున్న సూపర్ ఫాస్ట్ నొజోమీ బులెట్ రైలు. రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఒంటికి నూనె రాసుకున్న ఓ పాసింజర్ టాయిలెట్ సమీపానికి వెళ్లి నిప్పంటించుకున్నాడు. అసలే బులెట్ ట్రయిన్ కావడంతో మంటలు శరవేగంగా కమ్ముకున్నాయి. ఈ దృశ్యాలను చూసిన ఇద్దరు ప్రయాణికులకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంలో మరికొంత మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నది యువకుడా? లేక యువతా? అన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటన ప్రశాంతంగా ఉండే జపాన్ లో సంచలనం కలిగించింది.