: పదేళ్ల బంధానికి 'బై' చెప్పనున్న టీవీ18, సీఎన్ఎన్!
గడచిన పదేళ్ల నుంచి బ్రాండ్ లైసెన్స్ ఒప్పందంలో భాగంగా కలసి పనిచేస్తున్న మీడియా సేవల సంస్థలు టీవీ18 బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్, కేబుల్ న్యూస్ నెట్ వర్క్ (సీఎన్ఎన్)లు విడిపోనున్నాయి. మరో ఆరు నెలల్లో రెండు సంస్థల మధ్యా ఒప్పందం గడువు ముగిసిపోనుంది. గత సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ నెట్ వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ ను రూ. 4 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీవీ18 బ్రాడ్ కాస్ట్ సంస్థ సీఎన్ఎన్-ఐబీఎన్ పేరుతో ఇంగ్లీష్ న్యూస్ చానెల్ ను నడుపుతోంది. జనవరి తరువాత ఇరు సంస్థలూ విడివిడిగా న్యూస్ చానళ్లను నిర్వహిస్తాయని తెలుస్తోంది.