: పోలీసుల రంగ ప్రవేశంతో ప్రేమ కథ సుఖాంతం
హైదరాబాద్, సైదాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంటున్న ప్రియుడ్ని చితకబాది ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇది మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు, వధూవరులు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, వారిద్దరికీ మైనారిటీ తీరిందని గుర్తించారు. స్నేహితుల సాయంతో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించారని తెలుసుకున్నారు. దీంతో ప్రియుడు దుర్గేష్, ప్రియురాలు మౌనికలతో మాట్లాడారు. వారు వివాహం చేసుకుంటామని చెప్పడంతో, ఇరు కుటుంబాల పెద్దలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో రెండు కుటుంబాలు దుర్గేష్, మౌనికల వివాహానికి అంగీకరించడంతో, వారికి సైదాబాద్ లోని ఆర్యసమాజ్ లో వివాహం జరిపించారు.