: ఈ ప్రయాణం సాహసమే: సోలార్ ఇంపల్స్ ప్రతినిధి


జపాన్ మీదుగా హవాయి ద్వీపానికి ప్రయాణం చేయడం సాహసమేనని, ఏ క్షణంలో అయినా వాతావరణం ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని సోలార్ ఇంపల్స్ విమాన ప్రతినిధి ఎల్కే న్యూమన్ తెలిపారు. జపాన్ లోని నగోయాలో ఆయన మాట్లాడుతూ, నగోయా నుంచి ఐదు రోజుల క్రిందటే సోలార్ ఇంపల్స్ విమానం బయల్దేరాల్సి ఉన్నప్పటికీ, వాతావరణ ప్రతికూలత వల్ల వెళ్లలేకపోయామని అన్నారు. నేడు వాతావరణం అనుకూలించడంతో బయల్దేరుతున్నామని అన్నారు. నగోయా నుంచి హవాయి చేరుకునేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఫసిఫిక్ మహాసముద్రం మీదుగా సోలార్ ఇంపల్స్ విమానం ప్రయాణించనుంది. ఒకసారి ఛార్జ్ అయితే పది గంటలపాటు నిర్విరామంగా ప్రయాణించగల సామర్థ్యమున్న సోలార్ ఇంపల్స్ విమానాన్ని ప్రయోగాత్మకంగా ప్రపంచ యాత్ర చేయిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారు జాము 3 గంటలకు సోలార్ ఇంపల్స్ విమానం నగోయా నుంచి హవాయి బయల్దేరింది. ఎలాంటి అవాంతరం లేకుండా సోలార్ ఇంపల్స్ సుదూర తీరాలు ప్రయాణిస్తే, విమానయానంలో విశేషమైన మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News