: మద్యం తాగితే స్పృహ ఉండదు... నేరాలకు ఎలా పాల్పడతారు?: బాబూలాల్ గౌర్
మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం ప్రాథమిక హక్కు అని, పైగా అది స్టేటస్ సింబల్ కూడా అని వ్యాఖ్యానించారు. మద్యపానం కారణంగా క్రైమ్ రేటు పెరగదని అన్నారు. "మద్యం తాగిన తర్వాత ప్రజలు స్పృహలో ఉండరు. అప్పుడు వారేమీ చేయలేరు. అలాంటప్పుడు క్రైమ్ రేటు పెరగడానికి మద్యం ఎలా కారణమవుతుంది? అయితే, ఎవరూ మితిమీరి తాగరాదు. ఈ రోజుల్లో తాగడం అనేది స్టేటస్ సింబల్" అని వివరించారు. అంతకుముందోసారి ఆయన మహిళల భద్రత విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని మహిళలు నిండుగా దుస్తులు ధరిస్తారని, అందుకే, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తమిళనాడులో మహిళలపై అఘాయిత్యాలు తక్కువని అభిప్రాయపడ్డారు.