: ప్రభుత్వ ఆస్తిని హోటల్ గా మార్చేసిన రాజే, మోదీ: కాంగ్రెస్ నిప్పులు


రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, ఐపీఎల్ మాజీ అధ్యక్షుడు లలిత్ మోదీలు వ్యాపార భాగస్వాములని కాంగ్రెస్ విమర్శించింది. వీరిద్దరూ కలసి ప్రభుత్వ ఆస్తి అయిన ధోలాపూర్ ప్యాలెస్ ను లగ్జరీ హోటలుగా మార్చివేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. దీనికోసం మోదీ, రాజే కుమారుడు దుష్యంత్ తో కలసి రూ. 100 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన న్నారు. ఇప్పుడు ఆ హోటల్ రాజె, దుష్యంత్‌ల అధీనంలోని నియంత్ హెరిటేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉందని జైరాం రమేశ్ ఆరోపించారు. మారిషస్ నుంచి రూ. 21 కోట్లను తెచ్చిన లలిత్ మోదీ వాటిని దుష్యంత్ కంపెనీలో పెట్టాడని ఆయన అన్నారు. ఈ ఆరోపణలపై సమాధానం ఇచ్చేందుకు రాజే జంకుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News