: ప్రియుడికి రెండు తగిలించి, ప్రియురాలిని బలవంతంగా లాక్కెళ్లిన తల్లిదండ్రులు


హైదరాబాదు, సైదాబాద్ లోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన ప్రేమజంటను యువతి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. కాసేపట్లో యువతీ యువకుల వివాహ తంతు ముగుస్తుందనగా అక్కడికి చేరుకున్న యువతి కుటుంబసభ్యులు ప్రియుడ్ని చితకబాది, యువతిని బలవంతంగా తీసుకెళ్లారు. యువతి ఎంత పెనుగులాడినా కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లిపోవడం విశేషం. ఈ సందర్భంగా సైదాబాద్ లో కాసేపు గందరగోళం నెలకొంది. అకస్మాత్తుగా వచ్చిన గుంపు యువకుడిపై దాడికి దిగడంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. దీనిని చిత్రీకరించిన మీడియా వారిని కూడా యువతి బంధువులు దుర్భాషలాడడం జరిగింది.

  • Loading...

More Telugu News