: నేపాల్ లో నేడు రెండు భూకంపాలు
నేపాల్ ను భూకంపాలు వదలడం లేదు. రెండు నెలల క్రితం సంభవించిన భూకంపం 9 వేల మందిని పొట్టనబెట్టుకోగా, తాజా భూకంప నష్టాన్ని నేపాల్ ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ ఉదయం 5.2 తీవ్రతతో కంపించిన భూమి, నేటి మద్యాహ్నం 3.3 తీవ్రతతో కంపించింది. కాగా, ఆమధ్య నేపాల్ లో సంభవించిన భారీ భూకంపం తరువాత ఇప్పటి వరకు 343 సార్లు, నాలుగు అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. నేడు సంభవించిన స్వల్ప భూకంప కేంద్రం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు వెల్లడించారు. భూకంపం ధాటికి అతలాకుతలమైన నేపాల్ కు గత వారం ప్రపంచ దేశాలు ఆర్థిక సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.