: బంగాళాఖాతంలో కూలిన బంగ్లా యుద్ధ విమానం
బంగ్లాదేశ్ కు చెందిన యుద్ధవిమానం సముద్రంలో కూలిపోయింది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ మిలటరీ బేస్ నుంచి బయల్దేరిన ఎఫ్-7 యుద్ధవిమానం సాంకేతిక లోపం తలెత్తడంతో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే బంగాళాఖాతంలో కూలిపోయింది. దీంతో బంగ్లాదేశ్ పోలీస్, నేవీ అధికారులు విమానం, పైలట్ ల కోసం గాలింపు చేపట్టారు. ఈ విమానాన్ని పైలట్ల శిక్షణ కోసం వినియోగిస్తున్నట్టు మిలటరీ అధికారులు వెల్లడించారు.