: జేసీ సోదరుల నిరసనల ఫలితం... తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్స్ లాకౌట్
తాడిపత్రి సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీని లాకౌట్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, గత వారం రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట జేసీ సోదరుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, దీక్షలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులను ఎవరినీ లోపలికి పోనీయకపోవడంతో వారం రోజులుగా పని నిలిచింది. దీంతో లాకౌట్ ప్రకటిస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. తాము ఉపాధిని కోల్పోయామని ఆరోపిస్తూ, కార్మికులు నిరసనలకు దిగడంతో, ఫ్యాక్టరీ గేటు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.