: టీఎన్జీవో నేతలు టీఆర్ఎస్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: పొన్నం ప్రభాకర్
తెలంగాణ ఎన్జీవో నేతలు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఉద్యోగుల విభజనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు బాధ్యతలు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. నేతలు ఇలాగే వ్యవహరిస్తే ఉద్యోగులు వారిని నాయకత్వం నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. శ్రీనివాస్, దేవీప్రసాద్ లు ఈ విషయాన్ని గమనించాలని పొన్నం సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ లో విలేకరులతో పొన్నం మాట్లాడారు. సెక్షన్ 8 పై కేసీఆర్, చంద్రబాబు ఆడుతున్నది రాజకీయ క్రీడ అని, అందులో ఉద్యోగుల ప్రమేయం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగుల విభజనలో కమలనాథన్ జాప్యం చేస్తే ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు నిలదీయలేదని పొన్నం సూటిగా ప్రశ్నించారు.