: ఏపీ విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ పై హైకోర్టులో విచారణ వాయిదా


తెలంగాణ ట్రాన్స్ కోలో స్థానికత ఆధారంగా ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేయడంపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. దానిపై వాదనలు వినిపించేందుకు తెలంగాణ ట్రాన్స్ కో కోర్టును సమయం కోరింది. దాంతో ఉన్నత న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. 1400 మంది ఏపీ ఉద్యోగులను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై అంతకుముందు హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అయినా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లి మొర పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News