: జింబాబ్వే టూర్ లో కెప్టెన్ గా రెహానే... ధోనీ, కోహ్లీలకు విశ్రాంతి


టీమిండియా జట్టు సభ్యుడు అజింక్యా రెహానేకు ప్రమోషన్ లభించింది. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలు లేకుండా జింబాబ్వే పర్యటనకు వెళుతున్న టీమిండియాకు అతడు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. అంతేకాక జింబాబ్వే టూర్ కు ధోనీ, కోహ్లీ సహా రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనాలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక వన్డే జట్టుకు సంబంధించి అశ్విన్ స్థానంలో హర్భజన్ సింగ్ కు చోటు దక్కింది. జింబాబ్వే టూర్ కు వెళ్లే జట్టులో అజింక్యా రెహానే, రాబిన్ ఊతప్ప, మురళీ విజయ్, అంబటి రాయుడు, మనీష్ తివారి, ఉమేశ్ యాదవ్, హర్భజన్ సింగ్, మోహిత్ శర్మ, బిన్నీ, దవళ్, కేదార్, సందీప్, అక్షర్, కరణ్ శర్మ, భువనేశ్వర్ లు ఉన్నారు. ఈ టూర్ లో జింబాబ్వే జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.

  • Loading...

More Telugu News