: మరింత వేగం, మరింత చౌక... ఇంటర్నెట్ స్పీడ్ లో మరో మైలురాయి


గిగాబైట్ల ఇంటర్నెట్ వేగం టెర్రాబైట్లకు మారనుంది. మరింత వేగంగా, చౌకగా ఇంటర్నెట్ సేవలను అందించేలా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా రీసెర్చర్లు జరిపిన కృషి ఫలించింది. ప్రస్తుతమున్న ఆప్టికల్ ఫైబర్ లైన్లనే ఉపయోగిస్తూ, నెట్ సమాచారం 12 వేల కిలోమీటర్ల దూరాన్ని ఎటువంటి పవర్ బూస్టర్లు లేకుండానే పంపగలిగారు. దీంతో నవీన ఇంటర్నెట్ యుగం మరో కీలక మైలురాయిని దాటింది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కు మధ్య మధ్యలో సిగ్నల్ స్ట్రెంగ్త్ తగ్గకుండా బూస్టర్లను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపై అటువంటి అవసరం లేకుండానే ఎంత దూరమైనా సిగ్నల్స్ శరవేగంగా ప్రయాణిస్తాయని అధ్యయనం జరిపిన వర్శిటీ రీసెర్చర్ అలిక్ తెలిపారు. పవర్ రిపీటర్లు, ఎలక్ట్రానిక్ రీజనరేటర్లను తాము వాడలేదని, సంప్రదాయ ఆంప్లిఫయర్లతోనే రికార్డు స్థాయి దూరాన్ని డేటా ప్రయాణించిందని వివరించారు. ఈ విధానం అమలు చేస్తే దశలవారీగా సిగ్నల్ రీజనరేటర్లను తొలగించవచ్చని, దీని ద్వారా డేటా వాడకానికి వినియోగించే మొత్తం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News