: రఘువీరా ఒంటరి పోరాటం చేస్తున్నారు... భేష్!: దిగ్విజయ్


ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోనప్పటికీ... ప్రజాసమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందని అన్నారు. రఘువీరారెడ్డి ఒక రకంగా ఒంటరి పోరాటం చేస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడని టీడీపీ ఆరోపిస్తున్నప్పటికీ... రఘువీరా ఆరోపణలకు టీడీపీ సమాధానం చెప్పలేకపోతోందని డిగ్గీ రాజా అన్నారు. కొద్ది మంది నేతల సహకారం మాత్రమే రఘువీరాకు ఉన్నప్పటికీ, ఆయన ఏమాత్రం రాజీ లేకుండా ముందుకు సాగుతున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News