: ఫిట్ నెస్ కోసం ‘క్రాస్ ఫిట్’’ జపం చేస్తున్న సినీ తారలు!
ఫిట్ నెస్ అంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి. క్రీడాకారుల సంగతి అలా పక్కనబెడితే, యువతరంతో పాటు సినీజనం దీని కోసం అర్రులు చాస్తున్న సంగతి తెలిసిందే. ఫిట్ నెస్ లేకుంటే, ఇక అంతేనంటూ సినీజనం రోజంతా గంటల తరబడి జిమ్ లలో కుస్తీలు పడుతుంటారు. ప్రస్తుతం ఫిట్ నెస్ కోసం పరితపిస్తున్న వారి కోసం కొత్తగా ‘క్రాస్ ఫిట్’ రంగ ప్రవేశం చేసింది. పాశ్చాత్య దేశాల్లో పురుడుపోసుకున్న ఈ తరహా కొత్త వ్యాయామం, తాజాగా మన దాకా వచ్చేసింది. ప్రస్తుతం యువతతో పాటు సినీజనం కూడా ‘క్రాస్ ఫిట్’ జపం చేస్తున్నారు. రకరకాల వ్యాయామ రీతుల సమాహారమే ‘క్రాస్ ఫిట్’గా రంగప్రవేశం చేసిందని వ్యాయామ శిక్షకులు చెబుతున్నారు.