: ఫామ్ హౌస్ ను వీడిన కేసీఆర్... ఐదు రోజుల తర్వాత హైదరాబాదుకు పయనం
మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎరవలి సమీపంలో ఏర్పాటు చేసుకున్న తన ఫామ్ హౌస్ లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడప్పుడు సేదదీరుతుంటారు. ఒకటి, రెండు రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుని వెనువెంటనే హైదరాబాదుకు వచ్చేస్తుంటారు. అయితే, గత వారం ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్, నిన్న మధ్యాహ్నం దాటిన తర్వాత హైదరాబాదుకు పయనమయ్యారు. అంటే, ఈ దఫా ఏకంగా ఐదు రోజుల పాటు ఆయన ఫామ్ హౌస్ లోనే బస చేశారు. తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అల్లం సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లం సాగుపై కూలీలకు, ఫామ్ హౌస్ పర్యవేక్షకులకు పలు సలహాలు, సూచనలు చేసిన ఆయన, నిన్న అక్కడి నుంచి బయలుదేరే సమయంలో కూడా మరోమారు అల్లం సాగు పనులను చూసి మరీ వచ్చారట. ‘‘వచ్చే నెలలో మరోసారి వస్తాను. ఆలోగా అల్లం సాగు పనులన్నీ పూర్తి కావాలి’’ అంటూ ఆయన అక్కడి కూలీలు, పర్యవేక్షకులకు ఆర్డరేసీ మరీ వచ్చారట.