: డ్రంకన్ డ్రైవ్ లో లేడి ఇండస్ట్రియలిస్ట్... మీడియాపై చిందులు తొక్కిన వైనం
మద్యపానానికి అలవాటు పడుతున్న మహిళల సంఖ్య హైదరాబాదులో నానాటికీ పెరిగిపోతోంది. వీకెండ్ లలో ఫుల్లుగా మద్యం కొట్టి ర్యాష్ గా రోడ్లపైకి కార్లతో దూసుకువస్తున్న మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇలా మద్యం మత్తులో కారు నడిపి పది రోజుల క్రితం ఓ లేడీ డాక్టర్ పోలీసులకు పట్టుబడగా, నిన్న తెల్లవారుజామున ఓ లేడి ఇండస్ట్రియలిస్ట్ దొరికిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో డ్రంకన్ డ్రైవ్ సోదాలు చేస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అమూల్యారెడ్డి అనే మహిళా పారిశ్రామికవేత్త కారును ఆపకుండా వేగంగా దూసుకుపోయారు. అయితే ఆమె వాహనాన్ని వెంటాడిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను ఆపగలిగారు. ఆ తర్వాత ఆమెకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా, మోతాదుకు మించి మద్యం తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే, పోలీసులు తనను తనిఖీ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపై అమూల్యారెడ్డి చిందులేశారు.