: కడియం శ్రీహరి అసత్యాలు ప్రసారం చేయడం సరికాదు: మంత్రి గంటా
తాము పలుమార్లు లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తమ రికార్డులను తమకు అప్పగించలేదని ఏపీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో తాను, శ్రీహరి చర్చించామని... ఆ సమావేశంలో రికార్డులన్నింటినీ అప్పగిస్తామని కడియం స్వయంగా అంగీకరించారని... ఆ తర్వాత మాట తప్పారని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడియంతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని... ఆయన చర్చలకు రావాలని... ఈ విషయంలో మీడియా బాధ్యత తీసుకోవాలని కోరారు. రికార్డులు ఇవ్వకుండా, తిరిగి అసత్య ప్రచారాలు చేయడం కడియంకు సరికాదని హితవు పలికారు.