: చంద్రబాబును అభినవ అంబేద్కర్ గా అభివర్ణించిన మంత్రి పీతల
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో పోల్చారు మంత్రి పీతల సుజాత. అభినవ అంబేద్కర్... చంద్రబాబు అంటూ ఆమె కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని చెప్పారు. మరోవైపు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను గవర్నర్ నరసింహన్ సమానంగా చూడాలని కోరారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్-8ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. నగరంలో నివసిస్తున్న సీమాంధ్రుల్లో భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని చెప్పారు.