: ఏకంగా 86 బైక్ లను తగలబెట్టేశారు


తెల్లారేసరికి 86 బైక్ లను తగలబెట్టేశారు గుర్తు తెలియని దుండగులు. విస్మయం గొలిపే ఈ ఘటన పూణెలోని సన్ సిటీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మూడు, నాలుగు గంటల మధ్య ఈ ప్రాంతానికి చేరుకున్న దుండగులు అపార్ట్ మెంట్లు, షాపుల ముందు పార్క్ చేసిన బైకుల పెట్రోల్ పైపులను తొలగించి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 86 టూవీలర్లతో పాటు, కొన్ని కార్లు కూడా తగలబడిపోయాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కూడా ఇదే తరహాలో ధన్ కావాడి ప్రాంతంలో వాహనాలను తగలబెట్టారు.

  • Loading...

More Telugu News