: తిరుమలకు సంబంధించి వివాదాస్పద సూచనలు చేసిన కుర్తాళం పీఠాధిపతి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం రోప్ వేనే కాదు, హెలిప్యాడ్ ను కూడా నిర్మించవచ్చని కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వర భారతి వివాదాస్పద సూచనలు చేశారు. ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, ఆలయం వెలుపల ఉన్న మీడియాతో ఆయన మాట్లాడుతూ, గర్భాలయంపై నుంచి మాత్రం విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకుంటే చాలని అన్నారు. తిరుమలపై నుంచి విమానాలు ప్రయాణించడం నిషిద్ధమన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సిద్ధేశ్వర భారతి మరిన్ని సూచనలు చేశారు. ఆచార వ్యవహారాల్లో భాగంగా స్వామివారికి గంట సేపు విరామం ఇవ్వాలని సూచించారు. అలాగే, నామాల అంశాన్ని వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు.