: ఓటుకు నోటు కేసులో రాజీపడలేదు... పకడ్బందీగా కేసు పెట్టడానికి ఏసీబీ అధికారులు సమయం తీసుకుంటున్నారు: కడియం


కీలకమైన ఓటుకు నోటు కేసులో రాజీ అవుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. రాజీ అవుతున్నామనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒకసారి కేసు నమోదైన తర్వాత ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు. కేసును పకడ్బందీగా పెట్టడానికి ఏసీబీ అధికారులు సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. స్టీఫెన్ కు రేవంత్ రెడ్డి డబ్బు ఇవ్వలేదని కానీ, స్టీఫెన్ కు తాను ఫోన్ చేయలేదని కానీ, ఆడియోలో ఉన్నది తన స్వరం కాదని కానీ చంద్రబాబు ఇంతవరకు చెప్పలేదని... దీన్ని బట్టే ఆయన తప్పు చేశారన్న విషయం అర్థమవుతోందని చెప్పారు. ఈ కేసులో బీజేపీ కూడా తన వైఖరి ఏంటో చెప్పడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News