: రఘురాం రాజన్ వ్యాఖ్యలకు ఐఎంఎఫ్ కౌంటర్!


ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ సకాలంలో స్పందించకుంటే, 1930 నాటి మాంద్యం మరోసారి వచ్చే ప్రమాదముందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఖండించింది. ఈ మేరకు ఓ రీసెర్చ్ పేపర్ ను విడుదల చేసింది. ఆర్థిక కష్టాలకు కేవలం పరపతి సమీక్షల్లో తీసుకునే సరళీకృత విధానాలనే కారణమని వ్యాఖ్యానించడం భావ్యం కాదని అభిప్రాయపడింది. గతంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గా, 2007లో 'ఫైనాన్షియల్ క్రైసిస్' ఏర్పడతాయని ముందే అంచనా వేసిన విజ్ఞానిగా గుర్తింపున్న రాజన్, ఇటీవల లండన్ బిజినెస్ స్కూల్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ ఆర్థికరంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పలు దేశాలు పోటీ పడి పరపతి విధాన సమీక్షలు జరుపుతూ, వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతుండడం ప్రమాదకారిగా మారుతోందని రాజన్ అభిప్రాయపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ, సరైన నియంత్రణ లేకనే 2007-09 మాంద్యం ఏర్పడిందని ఐఎంఎఫ్ విడుదల చేసిన అధ్యయనంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎకానమిస్ట్ ఆంబ్రోజియో సెసా బియాంచీ, జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అలెసాండ్రో రెబుక్కీలు వివరించారు. ఈ విషయంలో నిపుణుల మధ్య మరింతగా చర్చ జరగాల్సి వుందని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News