: చంద్రబాబుకు పెయిడ్ ఆర్టిస్టుగా పవన్ కల్యాణ్: అంబటి


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సినీ నటుడు పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్టుగా ప్రవర్తిస్తున్నాడని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. తన ట్విట్టర్ ఖాతాలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసే బదులు మీడియా ముందుకు వచ్చి తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో పవన్ కు తెలిసినట్టు లేదని, భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడతానన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నరు వ్యవస్థను రద్దు చేయాలని గతంలో కోరిన టీడీపీ, ఇప్పుడు అదే గవర్నరుకు సర్వాధికారాలు ఇవ్వాలని అంటోందని ఆయన ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసును తప్పుదోవ పట్టించేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని అంబటి విమర్శించారు.

  • Loading...

More Telugu News