: నరికిన తలతో 'సెల్ఫీ' పంపిన ఫ్రాన్స్ అటాకర్!
ఫ్రాన్స్ లోని గ్లాస్ ఫ్యాక్టరీపై దాడి చేసి తన యజమాని తల నరికిన దుండగుడు, ఆ తలతో తాను తీయించుకున్న 'సెల్ఫీ'ని నార్త్ అమెరికాలోని ఓ నెంబరుకు వాట్స్ యాప్ ద్వారా పంపాడు. అయితే, అతని కాంటాక్టును తాము గుర్తించలేకపోయామని, లోకేషన్ ను ఫిక్స్ చేయడం కుదరలేదని విచారణ అధికారి ఒకరు తెలిపారు. కాగా, శుక్రవారం నాడు గ్లాస్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.