: చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తున్నా: ఆనం
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో తాను కూడా నటిస్తున్నట్లు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలియజేశారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి 150వ సినిమా కోసం ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ సినిమాలో సామాజిక న్యాయం, మీడియాపై నిషేధం వంటి అంశాలను చర్చించనున్నట్టు తెలిపారు. వార్డు సభ్యుల నుంచి ఎమ్మెల్యేల వరకూ కొనుగోలు చేయడం తెలుగుదేశానికి అలవాటని, వారికి అమ్ముడు పోవడం వైకాపాకి పరిపాటని ఆనం ఎద్దేవా చేశారు.